Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of Integrated District Offices Complex (IDOC) at Mulugu | Mulugu District.

ములుగు జిల్లాలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని (IDOC) ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

✅ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా వనదేవతలు సమ్మక్క – సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు.

✅ ములుగు ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా జంపన్నవాగును నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.

✅ జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంతో పాటు కోర్టు భవనాలను నిర్మించాలని మంత్రి సీతక్క గారు చేసిన సూచనల మేరకు వాటిని త్వరలోనే చేపడుతామని తెలిపారు. మల్లూరు నరసింహ స్వామి దేవాలయానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

✅ ఈ ప్రాంతంలోని ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారుపేరు. మీ కష్టాలు తీరాలంటే, సాగునీరు అందించాలి. సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులను మంత్రి పొంగులేటి గారు త్వరలోనే సమీక్ష చేసి, అవసరమైన నిధులు మంజూరు చేస్తారని తెలిపారు.

✅ ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్, ఏటీసీలతో పాటు భవిష్యత్తులో సాంకేతిక విద్యను అందించడానికి ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం ఏం కావాలన్నా నిధులను మంజూరు చేస్తామన్నారు.

✅ రైతులు, ఆడపడుచులు, నిరుద్యోగ యువకులు, విద్యార్థుల విషయంలో ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు పోతుందని వివరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమ ఫోకస్‌ను మార్చుకోవాలని సూచించారు.

✅ నర్సరీ నుండి 12వ వరకు విద్యకు ప్రాధాన్యతనిచ్చి, ఆ తర్వాత స్కిల్స్ నేర్చుకోవాలని ఈ సందర్భంగా యువతకు సూచించారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీపడి రాణించగలరని, విద్య, సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు.

✅ “మీరు అండగా నిలబడండి. మీ సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం. రాష్ట్రంలో పాడి పంటలు పండించుకుందాం. తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుకుందాం” అని పిలుపునిచ్చారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inaugurated the newly constructed Integrated District Offices Complex (IDOC) in Mulugu and unveiled the Telangana Thalli statue on the premises.

🔹 Addressing the gathering, the Chief Minister assured that the government would provide necessary funds for the comprehensive development of Mulugu, including the development of Jampannavagu, irrigation projects, the SP office and court buildings, and Mallur Narasimha Swamy Temple.

🔹 He said the government would strengthen education and skill development in the region through Young India Integrated Residential Schools, ATCs and technical education opportunities for local youth.

🔹 The Chief Minister urged students to focus on both education and technical skills to compete globally and access better employment opportunities.

🔹 Calling for collective support, he said the government would address the people’s problems and work towards a prosperous and self-reliant Telangana.