Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of Dr. MCR Telangana Institute of Medical Sciences (TIMS) Hospital at Sanathnagar, Hyderabad.

హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.

కార్డియో, రీనల్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సైన్సెస్ విభాగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్‌ఆపరేటివ్ వార్డు, ట్రామా విభాగం, ఐసీయూ వంటి విభాగాలను మంత్రులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

చికిత్స కోసం వచ్చే వారి నమోదు, రిసెప్షన్‌లో టోకెన్ డిస్పెన్సర్ యంత్రం పని తీరు, ఓపీ కౌంటర్ పనితీరును పరిశీలించారు. ఆయా విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడారు. అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించి వాటి పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు0

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రి గారి వెంట ఉన్నారు.

Following the inauguration of the state-of-the-art Dr Marri Channa Reddy Telangana Institute of Medical Sciences (Dr MCR TIMS) at Sanathnagar, Hyderabad, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy undertook a detailed inspection of the hospital’s key departments and facilities.

Along with the Ministers, the Chief Minister inspected the advanced operation theatres in Cardiac, Renal and Organ Transplant Sciences, as well as the post-operative ward, trauma unit and ICU. He also issued several directions to the officials.

The Chief Minister reviewed the patient registration process, the token dispenser at the reception and the OP counter. He interacted with doctors and nursing staff, inspected advanced medical equipment and enquired about their functioning. He directed officials to ensure efficient hospital management and provide quality medical services.

Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, Ministers Damodar Rajanarsimha, Komatireddy Venkat Reddy and Ponnam Prabhakar, along with several public representatives and officials, accompanied the Chief Minister.