Hon’ble Chief Minister Sri A. Revanth Reddy and Industries and IT Minister Sri Duddilla Sridhar Babu addressed the Telugu diaspora in London on Sunday.

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్‌లోని తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి గారు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఆదివారం లండన్‌లో తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ ప్రగతిపై వారితో విస్తృతంగా చర్చించారు.

తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలని, తెలంగాణ రైజింగ్‌కు బలమైన మద్దతుదారులు, బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి గారు కోరారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy and Industries and IT Minister Sri Duddilla Sridhar Babu addressed the Telugu diaspora in London on Sunday.

The leaders interacted with the diaspora and invited them to become strong proponents and ambassadors of Telangana Rising, contributing to Telangana’s development and promoting its vision globally.