స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కె. చందన, సీఓఓ భరత్ డాకా ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు

అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావ‌ర‌ణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పవన్ కె చందన గారు, సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) భరత్ డాకా గారు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.

🚀 భారతదేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1 ను విజయవంతంగా ప్రయోగించిన తీరును వారు ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు.

🚀 సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పురోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రభుత్వం–ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై చర్చ జరిగింది.

🚀 ఈ సందర్భంగా స్కైరూట్ వ్యవస్థాపకులను ముఖ్యమంత్రి గారు అభినందించారు. వారు సాధించిన విజ‌యం భారతదేశాన్ని ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుంద‌ని ప్రశంసించారు.

Delhi: Telangana Government is committed to building a conducive ecosystem for advanced technology industries and startups, said Hon’ble Chief Minister Sri A. Revanth Reddy. Skyroot Aerospace Co-founders Pawan K Chandan and Bharat Dhaka met the Chief Minister and briefed him on the successful launch of Vikram-1, India’s first privately developed orbital-class launch vehicle.

🔹 The meeting focused on aerospace, space technology, innovation, R&D, advanced manufacturing, and collaboration opportunities between the government and private space sector. The Chief Minister congratulated Skyroot Aerospace on its achievement in strengthening India’s global space capabilities.