ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో దివీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను అందించాయి.

ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియాన్‌లో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, దివీస్, అరబిందో ఫార్మా కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం సీఎస్ఆర్ నిధుల కింద దివీస్ సంస్థ రూ. 12.18 కోట్లు, అరబిందో ఫార్మా రూ. 10 కోట్లకు సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఫౌండేషన్‌కు అందజేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ పథకం కోసం సీఎస్ఆర్ నిధులను అందించిన దివీస్, అరబిందో సంస్థలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందించారు.
ఆ పథకం అమలు కోసం హరే కృష్ణ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేసిన చోట సమీప ప్రాంతాల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రతినిధులకు వివరించారు. అవసరమైన కూరగాయలు, బియ్యం ఇతర సామగ్రిని నేరుగా రైతుల నుంచి తీసుకునేలా, రైతులను ఆర్గానిక్ పంటల వైపు ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తద్వారా పంటమార్పిడి విధానాన్ని ప్రోత్సహించడమే కాకుండా రైతులకు లాభాలను అందించవచ్చని ముఖ్యమంత్రి గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె రామకృష్ణారావు గారు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ గారు, హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభు జీ గారు, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ మధు బాబు గారు, అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి గారు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
CSR contributions from Divi’s Laboratories and Aurobindo Pharma were extended to the Hare Krishna Movement Charitable Foundation for the Breakfast Scheme in Government Schools, in the presence of Hon’ble Chief Minister Shri A. Revanth Reddy. At Bodhi Pavilion, MCRHRD, Divi’s Laboratories contributed ₹12.18 crore and Aurobindo Pharma ₹10 crore under their CSR initiatives.
The Chief Minister appreciated the two companies for supporting the Foundation’s efforts to provide nutritious breakfast and midday meals to students in government schools. He also highlighted plans to link the Foundation’s centralized kitchens with local farmers through direct procurement of agricultural produce and promotion of organic farming.
Government Advisor Shri K. Ramakrishna Rao, Principal Secretary to CM Shri N. Sridhar, Hare Krishna Movement Charitable Foundation President Satya Gaura Chandra Dasa Prabhuji, Divi’s Laboratories Vice President Shri Madhu Babu, Aurobindo Pharma Managing Director Shri Nityananda Reddy and others attended the programme.
