ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాలు, ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక‌లుగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాలు, ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక‌లుగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతికి ప్ర‌తిరూపాలుగా ఉన్న కాక‌తీయ క‌ళాతోర‌ణం, రామ‌ప్ప ఆల‌యం, పిల్ల‌ల‌మ‌ర్రి దేవాల‌యం.. శిల్ప‌, వాస్తు క‌ళ‌ను ప‌రిశీలించి, అవి ప్ర‌తిబింబించేలా నిర్మాణాలు చేప‌ట్టాల‌ని సూచించారు.

ఆదిలాబాద్‌, వరంగల్ విమానాశ్ర‌యాలు, ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాల‌పై ముఖ్య‌మంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వ‌హించారు. ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాలు నిర్మించే ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్ర‌వాహం మార్పు, ర‌హ‌దారుల మ‌ళ్లింపు, బీఎస్ఎన్ఎల్ లైన్లు, తాగునీటి స‌ర‌ఫ‌రా లైన్ల మార్పు అంశాల‌ను అధికారులు ముఖ్యమంత్రి గారికి తెలియ‌జేశారు.

ఆయా అంశాల‌పై పూర్తి వివ‌రాలు తెలుసుకున్న ముఖ్య‌మంత్రి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. విమానాశ్ర‌యాల కాంపౌండ్ వాల్ స‌మీపం నుంచి ర‌హ‌దారులు నిర్మించాల‌ని, ఆ ర‌హ‌దారుల‌ను స‌మీప జిల్లా, రాష్ట్ర, జాతీయ ర‌హ‌దారుల‌కు అనుసంధానం చేయాల‌ని సూచించారు.

ఏ శాఖ‌కు ఆ శాఖ విడివిడిగా ప‌నులు చేప‌డితే, అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. విద్యుత్‌, ఆర్ అండ్ బీ, తాగునీటి స‌ర‌ఫ‌రా, నీటి పారుద‌ల శాఖ అధికారులు స‌మావేశ‌మై బీఎస్ఎన్ఎల్ అధికారుల‌తో చ‌ర్చించి, ఏక‌కాలంలో ప‌నులు సాగేలా చూడాల‌ని సూచించారు.

ప్రస్తుత అవ‌స‌రాల‌నే కాకుండా భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందించుకొని ప‌నులు ముందుకు సాగేలా చూడాల‌ని సూచించారు. వాగులు, ఇత‌ర నీటి ప్ర‌వాహాల‌ను మ‌ళ్లించాల్సి వ‌స్తే, విమానాశ్ర‌యాల ప్రాంగణం లేదా స‌మీపంలో చెరువుల‌ను నిర్మించి, అక్క‌డి నుంచి ప్ర‌వాహాల‌ను మ‌ళ్లించేలా చూడాల‌ని చెప్పారు.

విమానాశ్ర‌యాల‌కు వ‌చ్చే, వెళ్లే ర‌హ‌దారులు విశాలంగా ఉండ‌డంతో పాటు స‌మీపంలోని ముఖ్య ర‌హ‌దారుల‌కు అనుసంధానించేలా ఉండాలని, నిర్దేశిత స‌మ‌యంలో ప‌నులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాల‌తో పాటు ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాల‌కు సంబంధించిన డిజైన్ల‌ను ముఖ్య‌మంత్రి గారు సమావేశంలో ప‌రిశీలించారు. ప్ర‌తి నిర్మాణంలోనూ తెలంగాణ సంస్కృతి, శిల్ప‌, వాస్తు క‌ళ‌ల‌కు పెద్ద‌పీట వేయాల‌ని ఆదేశించారు. ప‌లు ఆకృతులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు మార్పుల‌ను సూచించారు.

ఈ సమావేశంలో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి గారు, ఎంపీలు వేం నరేంద‌ర్ రెడ్డి గారు, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి గారు, విప్ బీర్ల ఐల‌య్య‌ గారు, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు గారితో పాటు సంబంధిత ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Adilabad and Warangal airports, along with Telangana Bhavan in Delhi, should reflect Telangana’s culture, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy directed officials. He instructed officials to study the architectural and sculptural heritage of the Kakatiya Kala Thoranam, Ramappa Temple and Pillalamarri Temple and incorporate their essence into the designs.

The Hon’ble Chief Minister reviewed the projects at the Dr. B.R. Ambedkar Telangana State Secretariat. Officials briefed him on shifting power lines, water channels, roads, BSNL lines and drinking water pipelines at the airport sites.

The Chief Minister directed officials to build roads along the airport compound walls and connect them to nearby district, state and national highways. He stressed coordinated work by all departments and BSNL to avoid delays.

He called for comprehensive planning considering future requirements, including suitable arrangements for diverting water flows through ponds near the airport premises if required. He also directed that approach roads be wide, well-connected and completed within the stipulated time.

The Chief Minister reviewed the designs of the two airports and Telangana Bhavan in Delhi and directed officials to give prominence to Telangana’s culture, sculpture and architectural traditions. He suggested changes to several designs.

Minister Komatireddy Venkat Reddy, MPs Vem Narender Reddy and Chamala Kiran Kumar Reddy, Whip Beerla Ilaiah, State Government Chief Secretary Sanjay Jaju and senior officials of the concerned departments attended the meeting.