Chief Minister Sri A Revanth Reddy handed over appointment letters to the newly selected candidates in Hyderabad on Sunday.
CM’s Speech Points:
- The previous government did not consider the recruitment of jobs as its responsibility despite issuing notifications to fill the vacancies. After a long wait, the job aspirants lost faith in the last government.
- The unemployed youth sound the bugle for jobs against the previous government. I have also told the youth to throw out the previous government for jobs. The agitating youth trusted and gave a mandate to Congress.
- My government gave appointment orders to 30,000 selected candidates within 90 days of coming to power at the same place where we took oath.
- To bring more cheers to every family during the Dussehra festivities, the government handed over appointment letters today. It is a delightful moment that appointment orders are given to 1635 selected candidates today. Clapping by everyone is a witness to the happiness of all family members. Your long awaited dream come true today.
- The separate state of Telangana has been formed by the sacrifices of numerous youth. All the newly recruited persons will be part of the rebuilding of the Telangana State. It is not only a job but also an emotion. Be responsible in discharging your responsibilities on the job.
- Emulate famous engineer Mokshagundam Vishveshwaraiah who quenched the thirst of millions of Hyderabad people. Hyderabad is the hub of wonderful buildings constructed hundreds of years ago.
- Hundred years of experience on one side and 10 years of destruction on the other side. Decide whether you take Kaleshwaram as a role model or Nagarjuna Sagar in the construction of big projects. Be responsible from the day of joining the service to retirement. You all have the responsibility to win the trust of the people.
- The government will hand over appointment letters to 11,063 selected teachers on October 9. It is our sincerity and responsibility.
- The government decided to clean the river Musi by taking up the Musi Riverfront Development project. Notwithstanding the hurdles, we will take up the project.
- Do the people of Musi catchment areas live in stinking smells? The government will construct houses for the displaced and also provide them a better future.
- It is not good on the part of the Opposition to obstruct the project and instead come out with good suggestions.
- Visiting the Musi area is not enough to understand the problem. KTR, Harish and Eatala Rajendar should stay for a week in the houses along Musi River and then only the dwellers plights will be known.
ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం
ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్:
- వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం మీ ఉద్యోగాలు ఇవ్వడం బాధ్యతగా భావించలేదు.
- ఉద్యోగాల కోసం నిరీక్షించి నిరీక్షించి ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి..
- నిరుద్యోగ జంగ్ సైరన్ మోగించిన నాడు.. వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పా…
- మా మాటపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ ను గెలిపించారు..
- ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 90రోజుల్లోనే మేం ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం..
- దసరా పండగ నేపథ్యంలో తెలంగాణలో ప్రతీ కుటుంబంలో ఆనందం చూడాలని ఇవాళ మరిన్ని నియామక పత్రాలు అందిస్తున్నాం..
- 1635 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉంది..
- మీ చప్పట్లలో మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల ఆనందం కనిపిస్తుంది..
- ఏళ్లుగా నిరీక్షించిన మీ కల ఇవాళ సాకారమవుతోంది..
- వందలాది మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడింది.
- అలాంటి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు..
- ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. ఇది భావోద్వేగం..
- ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి..
- లక్షలాది మంది హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లను మీరు ఆదర్శంగా తీసుకోవాలి.
- హైదరాబాద్ లో వందల ఏళ్ల క్రితం నిర్మించిన అద్భుత కట్టడాలున్నాయి…
- వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు..
- కాళేశ్వరం కట్టినవారిని ఆదర్శంగా తీసుకుంటారో… నాగార్జున సాగర్ కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఆలోచించుకోండి..
- ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ఒకే విధంగా వ్యవహరించండి..
- ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మీ అందరిపై ఉంది..
- తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని.. విద్యార్థి నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్ కవచంగా మార్చుకున్నారు..
- ఇవాళ ముసుగు తొలగిపోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు..
- అక్టోబర్ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నాం.
- ఇది మా చిత్తశుద్ధి.. ఇది మా బాధ్యత..
- మూసీ మురికిని ప్రక్షాళన చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం..
- ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మీ చేతుల మీదుగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగబోతుంది…
- మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మూసీ కంపులోనే బ్రతకాలా?
- మూసీ పరివాహక ప్రజలకు ఇండ్లు కట్టించి వారికి మంచి భవిష్యత్తును అందిద్దాం..
- ప్రతీదానికి అడ్డుపడటం కాదు.. మూసీ బాధితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి..
- ఇలా వచ్చి అలా వెళ్లడం కాదు… ధైర్యం ఉంటే కేసీఆర్, హరీష్, ఈటెల మూసీ పరివాహక నివాసాల్లో వారం రోజులు ఉండండి..
- వాళ్ల కష్టాలు, బాధలు తెలుస్తాయి..