Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met Union Minister for Housing & Urban Affairs Sri Manohar Lal Khattar jee in New Delhi.

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2కు స‌త్వ‌ర‌మే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ గారికి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌తో ముఖ్య‌మంత్రి గారు స‌మావేశ‌మ‌య్యారు.

✅ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైద‌రాబాద్ న‌గ‌రంలో 76.4 కిలోమీట‌ర్ల పొడ‌వైన మెట్రో ఫేజ్‌-2 అవ‌స‌రం ఎంతో ఉంద‌ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. మెట్రో ఫేజ్‌-2 సాకార‌మైతే న‌గ‌రంలో రాక‌పోక‌లు వేగంగా సాగ‌డంతో పాటు ర‌హ‌దారుల‌పై ర‌ద్దీ త‌గ్గుతుంద‌ని.. సుస్థిరాభివృద్ధికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని వివరించారు.

✅ ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ సూచ‌న మేర‌కు అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు చేసి ప్రాజెక్టు డీపీఆర్ స‌మ‌ర్పించిన విష‌యాన్ని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ఖట్టర్ గారికి గుర్తు చేశారు. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2 ఆవ‌శ్య‌క‌త‌ను దృష్టిలో ఉంచుకొని ఇత‌ర శాఖ‌ల నుంచి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు ఇప్పించాల‌ని కోరారు.

✅ కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

New Delhi: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met Union Minister for Housing & Urban Affairs Sri Manohar Lal Khattar jee in New Delhi and urged the early approval of Hyderabad Metro Phase-2.

✅ The proposed 76.4 km Metro expansion is crucial for Hyderabad’s rapidly growing urban landscape. Once completed, it will enhance connectivity, reduce traffic congestion, and support sustainable development across the city.

✅The Chief Minister also highlighted that the revised Detailed Project Report (DPR), incorporating all suggestions from the Ministry, has already been submitted and requested expedited clearances from all concerned departments.

✅ The meeting was attended by Chief Secretary K. Ramakrishna Rao and senior officials.