నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగులో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సంత్ శ్రీ సేవాలాల్ విగ్రహ నిర్మాణం, హరిత హోటల్ భవనం, శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

రాష్ట్రంలో బంజారాలు, ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్న సంకల్పంతోనే సంక్షేమ పథకాల్లో ఎక్కువ శాతం గిరిజన వర్గాలకు అందిస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగులో రూ. 38 కోట్లతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయం, విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ముఖ్యమంత్రి గారు మద్దిమడుగు చేరుకోగానే మొదట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా రూ. 71 కోట్లతో మూడు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

సంత్ శ్రీ సేవాలాల్ విగ్రహ నిర్మాణంతో పాటు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో రూ. 15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హరిత హోటల్‌ భవనానికి, రూ. 18 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో ఎస్సీ, ఎస్టీలకు దాదాపుగా 45 శాతం ఇచ్చామని గుర్తుచేశారు. రాష్ట్రంలో 3.48 కోట్ల మంది పేదలకు సన్న బియ్యం అందిస్తుంటే, అందులో లంబాడ, ఆదివాసీ సోదరులు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని వివరించారు.

ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఏ సంక్షేమ పథకమైనా గిరిజన, ఆదివాసీలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో, ఆ వర్గాలు అభివృద్ధి చెంది దేశ సేవలో గొప్పగా రాణించాలన్న ఆలోచనతో ఈ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

“సంత్ సేవాలాల్ మహారాజ్ గారు గొప్ప ఆదర్శమూర్తి. శాంతియుతంగా, హింసకు దూరంగా బతకాలి. మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉండాలి. పేదలకు సేవలు అందించాలి. సమాజానికి ఆదర్శంగా నిలబడాలని బోధించి సంత్ సేవాలాల్ లంబాడీలకు ఆదర్శ దైవమయ్యారు” అని అన్నారు

“లంబాడీల ఆత్మగౌరవం నిలబెట్టాలన్న సంకల్పంతో జైపాల్ రెడ్డి గారి చొరవతో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు 1976లో బలహీన వర్గాల్లో ఉన్న లంబాడాలను ఎస్టీ జాబితాలోకి మార్పించారు. ఎస్టీ రిజర్వేషన్ల కారణంగా ఐఏఎస్, ఐపీఎస్, రాష్ట్ర, కేంద్రాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులుగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా రాణిస్తున్నారు” అని పేర్కొన్నారు.

భూమిలేని, వలసలు వెళుతున్న గిరిజనులకు అసైన్మెంట్ పట్టాలు, పోడు భూముల పట్టాలిచ్చారని, ఇందిరాగాంధీ గారు గిరిజనులకు 10-12 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

“నాది కొండారెడ్డిపల్లి. అచ్చంపేట ప్రాంతం నల్లమల బిడ్డను అని చెప్పుకున్నప్పుడల్లా.. గర్వంగా భావిస్తా. ఇక్కడి ప్రజలది కష్టపడే తత్వం. పోరాటం చేసి నిలబడే తత్వం. మాట ఇస్తే మట్టిలో కలిసైనా సరే నిలబెట్టుకునే తత్వం ఈ ప్రాంతం నుంచే అబ్బింది” అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

16 ఎకరాల్లో ఇక్కడ సంత్ సేవాలాల్ ఆలయాన్ని నిర్మిస్తున్నామని, మరో 4 ఎకరాలను కూడా సేకరించి అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దుకుందామని చెప్పారు. అలాగే, అచ్చంపేటలో బ్రిడ్జి, లిఫ్ట్ పనులతో పాటు మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తామన్నారు. డిండి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

With a commitment to the all-round development of Banjaras and Adivasis, the Telangana government is extending a major share of its welfare schemes to tribal communities, said Hon’ble Chief Minister Sri A. Revanth Reddy. The Chief Minister laid the foundation stone for the Sant Sri Sevalal Maharaj Temple and statue at Maddimadugu, Nagarkurnool district, at a cost of Rs. 38 crore.

On arrival, the Chief Minister offered special prayers at Sri Pabbati Anjaneya Swamy Temple and laid foundation stones for three development works worth Rs. 71 crore, including the Sant Sevalal Maharaj statue, a Haritha Hotel worth Rs. 15 crore and temple development works worth Rs. 18 crore.

Addressing the gathering, the Chief Minister said nearly 45 per cent of the 8 lakh Indiramma houses sanctioned had been allotted to SCs and STs. Banjara and Adivasi communities were among the major beneficiaries of fine rice distribution covering 3.48 crore poor people. Free RTC bus travel for women and free electricity up to 200 units were also aimed at tribal welfare and empowerment.

Describing Sant Sevalal Maharaj as an inspirational role model, the Chief Minister recalled his teachings on peaceful living, abstaining from violence, meat and alcohol, and serving the poor. The inclusion of Lambadas in the ST list in 1976, through Jaipal Reddy’s initiative and Indira Gandhi’s decision, enabled the community to excel in administration, politics and public service, including as IAS and IPS officers, ministers and Chief Ministers. The Chief Minister also recalled Indira Gandhi’s distribution of 10–12 lakh acres to tribals and the provision of land pattas to landless and migrating tribal families.

“I belong to Kondareddipalli and take pride in calling myself a son of Nallamala from Achampet. The courage, hard work and determination to honour one’s word come from the people of this region,” the Chief Minister said.

The temple is being constructed on 16 acres, with another 4 acres to be acquired for its grand development. The Chief Minister assured completion of the Achampet bridge, lift irrigation and other pending works, and promised water from the Dindi project.

Ministers Damodar Raj Narasimha, Jupally Krishna Rao, Vakiti Srihari and Adluri Lakshman Kumar, along with public representatives and officials from the erstwhile Mahabubnagar district, participated.