తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఇటీవల సూచనప్రాయంగా తెలియజేశారని చెప్పారు.
నీటి పారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారితో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌తో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై పీఠముడిగా ఉన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఎంత నీటిని తెచ్చుకోవచ్చు, 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే ఎల్లంపల్లి వరకు ఎంత నీటిని తరలించవచ్చనే వివరాలను నీటి పారుదల శాఖ ఇంజనీర్లు సమావేశంలో వివరించారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో ఎక్కడ కూడా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేదని వివరించారు. 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే దాదాపు 2,300 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని, 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే వెయ్యి ఎకరాల లోపే ముంపు ప్రభావం ఉంటుందని తెలిపారు.
మహారాష్ట్రలో ముంపు ప్రభావాన్ని అంచనా వేసి, సాధ్యమైనంత ఎక్కువ నీటిని తెచ్చుకునేందుకు వీలుగా ఈ బ్యారేజీ నిర్మించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
అటవీ, గిరిజన ప్రాంతం, అందులో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. అదే లక్ష్యాన్ని సాధించే సంకల్పంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల చర్చలు, సంప్రదింపులు జరగాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు.
జల్, జంగిల్, జమీన్ నినాదంతో ఏళ్ల తరబడి పోరాడిన అటవీ ప్రాంతవాసులందరికీ ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరగాలని అన్నారు. అందుకే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
బ్యారేజీ ఎత్తుపై స్పష్టత వచ్చిన తర్వాత, తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తెచ్చే ప్రాజెక్టు రూట్ డిజైన్లు, భూసేకరణపై దృష్టి సారించాలని ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు.
గతంలోనే 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిందని, అంత తక్కువ ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఆశించినంత నీటిని తెచ్చుకునే వీల్లేదని అన్నారు. అందుకే 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం, ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల వివరాలు, అక్కడ చర్చించిన అంశాలు, వాళ్లు కోరిన నివేదికలన్నీ వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రతో చర్చల సందర్భంగా తెలంగాణ నీటి అవసరాలను తెలియజేసి, మన వాదనను సమర్థంగా వినిపించాలని మంత్రులకు సూచించారు.
డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీరు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమయ్యే 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి అదనంగా సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు ఈ అదనపు నీటిని లిఫ్ట్ చేసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఎక్కడెక్కడ పంపులు, పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేయాలి, ప్రస్తుతం ఉన్న కాల్వలు, సొరంగాల సామర్థ్యం సరిపోతుందా, లేదా ఎక్కడైనా కాల్వల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుందా అనే అంశాలపై నీటి పారుదల విభాగం వెంటనే అధ్యయనం చేసి, అందుకు వీలైన డిజైన్లు తయారు చేసుకోవాలని ఆదేశించారు.
దీంతో పాలమూరు ప్రాజెక్టు నీటి అవసరాలకు ఎలాంటి కోత పడదని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. పాలమూరు నీటి కేటాయింపులకు ఆటంకం లేకుండా ఏదుల నుంచి డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు నీటిని అందించేలా ఈ పనులు చేపట్టాలని ఆదేశించారు.
డిండికి నార్లాపూర్ నుంచి లేదా ఏదుల.. ఎక్కడి నుంచి నీటిని తీసుకోవాలనే విషయంలో మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రతినిధుల అభ్యంతరాలు, విజ్ఞప్తులపై సమావేశంలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా నార్లాపూర్ నుంచి నీటిని తరలిస్తే ఎంత ఖర్చవుతుంది, ఏదుల నుంచి నీటిని తీసుకుంటే ఎంత అంచనా వ్యయం అవుతుందనే వివరాలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వాటిలోని అనుకూలతలు, ప్రతికూలతలన్నింటినీ వివరించారు.
మధ్యేమార్గంగా పాలమూరు ప్రాజెక్టు నీటికి ఢోకా లేకుండా డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు నీటిని లిఫ్ట్ చేసేందుకు వీలుగా అదనపు నీటిని తెచ్చుకునే పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు చేసిన సూచనకు మంత్రులు మద్దతు తెలిపారు.
Hon’ble Chief Minister A. Revanth Reddy directed officials to prepare for talks with the Maharashtra government on the Thummidihatti Barrage. The Chief Minister stated that Maharashtra Chief Minister Sri Devendra Fadnavis had recently indicated that he would invite Telangana for discussions after October 23.
The Chief Minister, Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, Ministers N. Uttam Kumar Reddy, Duddilla Sridhar Babu and Jupally Krishna Rao, MP Vem Narender Reddy, and senior Irrigation Department officials reviewed the Thummidihatti Barrage, Dindi and Achampet lift irrigation projects.
Engineers presented details of water availability and transfer potential at barrage heights of 152 metres and 150 metres, including the quantity that could be conveyed to Ellampalli. They clarified that no villages in Maharashtra would face submergence. Around 2,300 acres would be submerged at 152 metres, compared with less than 1,000 acres at 150 metres.
The Chief Minister directed officials to assess the submergence impact in Maharashtra and plan the barrage to bring in the maximum possible water. He said the project aims to irrigate 2 lakh acres in the forested and tribal regions of the highly backward undivided Adilabad district. He called for constructive negotiations with Maharashtra to benefit communities that have fought for years under the slogan “Jal, Jangal, Jameen” and directed officials to expedite the project.
Once the barrage height is finalised, officials must prioritise route designs and land acquisition for conveying water from Thummidihatti to Ellampalli. Noting that Maharashtra had earlier agreed to a height of 148 metres, the Chief Minister said this would not yield the expected quantity of water. He directed officials to prepare comprehensive technical reports on water availability, submergence and other relevant aspects to secure Maharashtra’s agreement to a 152-metre barrage.
Officials were instructed to immediately submit details of recent Central Water Commission meetings in Delhi, the issues discussed and all reports sought. Ministers were asked to effectively present Telangana’s water requirements during negotiations with Maharashtra.
The Chief Minister directed officials to arrange 0.5 TMC of water from Edula Reservoir for the Dindi project and 0.1 TMC for the Achampet Lift Irrigation Scheme. The additional 0.6 TMC required for both projects must be sourced from Srisailam. Officials were asked to plan a dedicated system to lift this additional water from Srisailam and Narlapur to Edula Reservoir.
The Irrigation Department must assess pump and pumphouse locations, check the capacity of existing canals and tunnels, identify any upgrades required, and prepare suitable designs. The Chief Minister clarified that Palamuru’s water requirements and allocations must remain unaffected, directing officials to supply water to Dindi and Achampet without compromising the Palamuru project.
The meeting also discussed concerns and representations from Mahabubnagar and Nalgonda district representatives on whether Dindi should receive water from Narlapur or Edula. Officials presented comparative cost estimates, along with the advantages and disadvantages of both options. Ministers supported the Chief Minister’s proposal to secure additional water for Dindi and Achampet while safeguarding Palamuru’s water allocations.
