భారత ఆర్మీ చేపట్టే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించే విధంగా కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు భారత ఆర్మీ సదరన్ కమాండ్ అధికారులకు తెలిపారు.
ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ గారు పలువురు ఆర్మీ ప్రతినిధులతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు.
ఆర్మీ నియామకాల్లో స్థానిక యువతకు భారీ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆసక్తి ఉన్న అనువైన జిల్లా కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కోరగా లెఫ్టినెంట్ జనరల్ సుముఖత వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ ఆర్మీ రిక్రూట్మెంట్లకు ముందస్తుగా తెలంగాణలోని ఆయా జిల్లా కేంద్రాల్లో యువతకు శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేస్తామని తెలిపారు.
దేశంలో విపత్తుల సమయంలో ఆర్మీ పోషిస్తున్న పాత్రను ముఖ్యమంత్రి గారు అభినందించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యల్లో ఆర్మీ యంత్రాంగం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కోరారు.
తెలంగాణలో విపత్తు పరిస్థితుల్లో ప్రత్యేకంగా చొరవ తీసుకునేలా స్థానిక ఆర్మీ అధికారులను ఆదేశిస్తాన రాజేష్ పుష్కర్ గారు చెప్పారు.
కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా చారిత్రక హైదరాబాద్ నగరానికి పూర్వవైభవాన్ని తేవాలన్న పట్టుదలతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టడంపై లెఫ్టినెంట్ జనరల్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి మూసీ నది ప్రక్షాళన అవసరమని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాస్ రావు గారు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Creating greater opportunities for Telangana youth in the Indian Army, the Telangana Government is ready to work closely with the Army to support participation in various recruitment drives, said Hon’ble Chief Minister Sri A. Revanth Reddy.
Southern Command GOC-in-C Lt. Gen. Rajesh Pushkar, along with senior Army officials, called on the Chief Minister at Bodhi Pavilion, MCR HRD Institute. Minister N. Uttam Kumar Reddy was also present.
The Chief Minister proposed district-level training programmes to help youth prepare for Army recruitment. The Army expressed readiness to establish training centres ahead of recruitment drives across the country.
The Chief Minister appreciated the Army’s role during disasters and sought greater support in flood rescue and rehabilitation efforts. Lt. Gen. Rajesh Pushkar assured proactive assistance during emergencies.
Lt. Gen. Rajesh Pushkar also appreciated the Musi Rejuvenation Project, saying restoration of the river is essential to protect and restore the glory of Hyderabad.
