మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రూ. 47.08 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
అభివృద్ధి పనుల వివరాలు:
రూ. 10 కోట్లతో ఊరుకొండపేట శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ అభివృద్ధి.
రూ. 20 కోట్లతో పాత మిడ్జిల్ మండలంలోని 40 గ్రామ పంచాయతీల అభివృద్ధి. (40 గ్రామాలు మండలాల పునర్విభజన తర్వాత ప్రస్తుతం మిడ్జిల్ మండలంలో 24, ఊరుకొండ మండలంలో 16 గ్రామాలు ఉన్నాయి).
రూ. 17.08 కోట్లతో మిడ్జిల్ మండలంలో చెక్ డ్యామ్ల నిర్మాణానికి శంకుస్థాపన
చెక్ డ్యామ్ల వివరాలు: భైరాంపల్లి గ్రామం సమీపంలో దుంధుబి వాగు, వడియాల్ గ్రామం సమీపంలోని చిన్న వాగు (దుంధుబి వాగు), వస్పుల గ్రామం సమీపంలోని వస్పుల కత్వా పునరుద్ధరణ.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy laid the foundation stone for development works worth ₹47.08 crore in Midjil Mandal of Mahabubnagar district. Along with Deputy Chief Minister Sri Mallu Bhatti Vikramarka, Ministers, public representatives, and officials, he launched several key infrastructure and development initiatives.
Key projects:
₹10 crore for the development of the Sri Anjaneya Swamy Temple at Urkondapeta.
₹20 crore for the development of 40 Gram Panchayats in the erstwhile Midjil Mandal.
₹17.08 crore for the construction and restoration of check dams, including works at Bhairampally, Vadiyal, and Vaspula villages.
