ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నాగర్‌కర్నూల్ జిల్లా ఉరుకొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి గారి రాక సందర్భంగా ఉరుకొండపేట గ్రామంలో కోలాహలం నెలకొంది.

రాజకీయ ప్రస్థానంలో జెడ్పీటీసీగా ఎన్నికైన 20 ఏళ్ల నాటి మరిచిపోలేని అనుభూతితో గ్రామంలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి గారికి ఆత్మీయులు, ఆనాటి పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆనాటి సహచరులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశంలో అలనాటి తోటి సహచరులను అప్యాయంగా పలకరిస్తూ ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ వారి బాగోగులు అడుగుతూ ముఖ్యమంత్రి గారు గత అనుభవనాలను నెమరువేసుకున్నారు. కొందరు 20 ఏళ్ల కిందట దిగిన ఫోటోలను చూపిస్తూ పాత అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణా రావుగారు, వాకిటి శ్రీహరి గారు, ఎంపీలు మల్లు రవి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy offered special prayers at the Sri Pabbati Anjaneya Swamy Temple in Urkondapeta, Nagarkurnool district, and laid the foundation stone for temple development works worth ₹10 crore.
Revisiting the village where he began his public service journey as a ZPTC Member 20 years ago, the Chief Minister received a warm welcome from longtime associates and village elders. He later interacted with former colleagues and recalled memories from his early years in public life.
Deputy Chief Minister Sri Mallu Bhatti Vikramarka, Ministers, MPs, MLAs, MLCs, and other public representatives participated in the programme.

