Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Attends the Rugby Premier League Season-2 Finals at Gachibowli, Hyderabad.

గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్–2లో విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టును ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబై డ్రీమర్స్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో 41–17 తేడాతో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది.

ఫైనల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి గారితో పాటు సినీనటుడు కొణిదెల చిరంజీవి గారు, రగ్బీ ఇండియా ప్రెసిడెంట్, నటుడు రాహుల్ బోస్ గారు, జీఎంఆర్ కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ గారు, క్రీడాకారిణి పీవీ సింధు గారు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె. శివసేన రెడ్డి గారు, నటి మృణాల్ ఠాకూర్ గారితో పాటు పలువురు ప్రముఖులు హాజరై వీక్షించారు.

అనంతరం ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ హీరోస్ కెప్టెన్ మన్యుయెల్ మొరెనోకు హెచ్ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్–2026 కప్‌ను అందజేశారు. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 పోటీలు ఈరోజు తుదిపోరుతో ముగిశాయి.

Hon’ble Chief Minister Shri A. Revanth Reddy congratulated the Hyderabad Heroes on their outstanding victory in the Rugby Premier League Season 2 final held at GMC Balayogi Stadium, Gachibowli.

In a high-intensity title clash, Hyderabad Heroes defeated Mumbai Dreamers by 41–17 to lift the HSBC Rugby Premier League 2026 trophy.

The Chief Minister, along with actor Konidela Chiranjeevi, Rugby India President and actor Rahul Bose, GMR Corporate Chairman Grandhi Kiran Kumar, badminton champion P. V. Sindhu, Telangana Sports Authority Chairman K. Shivasena Reddy, actress Mrunal Thakur, and other distinguished guests, witnessed the thrilling final.

Following the match, the Chief Minister presented the HSBC Rugby Premier League 2026 trophy to Hyderabad Heroes captain Manuel Moreno.

The Rugby Premier League Season 2, which commenced on the 16th of this month, concluded today with the grand finale.