
Chief Minister conducted a high-level review of the Education Department at the Dr. B.R. Ambedkar State Secretariat.
విద్యా శాఖకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

విద్యా శాఖకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో జరగనున్న క్రీడా పోటీలకు సంబంధించి చీఫ్ మినిస్టర్స్ కప్ 2వ ఎడిషన్ -2025 పోస్టర్ ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు.

ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు.

హనుమకొండ జిల్లా ప్రఖ్యాత ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు. అసెంబ్లీ ఛాంబర్‌లో మంత్రులు కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు ఆలయ పూజారులతో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు.

కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. నీటి హక్కులను కాపాడుకోవడంలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోందని చెప్పారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

నగరాన్ని వివిధ జోన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో సమీక్ష నిర్వహించారు.

శాసనమండలి భవన పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలిసి మండలి సమావేశ మందిర పునరుద్ధరణ, మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల కోసం కోస్గీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రతినిధులను ముఖ్యమంత్రి గారు సత్కరించి అభినందనలు తెలియజేశారు.

గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.
Site Map | Screen Reader | Contact | Terms Of Use | Disclaimer | Accessibility | Website Policies | Cyber Security | Help | FAQs | Grievance
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on April 16, 2026.