
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన 7th All India Prison Duty Meet-2025 తెలంగాణ ప్రతినిధులు.
తెలంగాణ వేదికగా జరిగిన జైళ్ల శాఖ 7వ జాతీయ స్థాయి డ్యూటీ మీట్ 2025 లో పతకాలు సాధించిన క్రీడాకారులను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభినందించారు. ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు 7 వ ‘అఖిల భారత ప్రిజన్ డ్యూటీ మీట్- 2025’ హైదరాబాద్ వేదికగా జరిగింది.








