
Hon’ble CM Revanth Reddy Visits Sringeri Shankara Math in Hyderabad
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ ‘పెట్ అండ్ ప్లే పార్క్’ పనులను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆకస్మికంగా పరిశీలించారు.

ప్రపంచ పెట్టుబడులకు, సాంకేతిక ఆవిష్కరణలకూ కేంద్రంగా నిలుస్తోన్న హైదరాబాద్ నగరంలో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ (Global Innovation Centre) స్థాపన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు స్వాగతించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

“పోలీసు అమరవీరుల సంస్మరణ దినం” సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ గోషామహల్‌లో నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులను స్మరిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు.

హైదరాబాద్ శిల్పకళా వేదికలో లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్స్‌ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు. శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

హైదరాబాద్‌లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన “ప్రజాపాలనలో కొలువుల పండుగ” కార్యక్రమంలో భాగంగా గ్రూప్ –2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాల అందజేశారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లెయింట్ అథారిటీ (SPCA) కి సంబంధించి రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్‌ను, లోగోను ఆవిష్కరించారు.
Site Map | Screen Reader | Contact | Terms Of Use | Disclaimer | Accessibility | Website Policies | Cyber Security | Help | FAQs | Grievance
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on [last-modified].