
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యం కావడానికి ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి వ్యక్తం చేసింది.
ప్రపంచ ఆర్థిక వేదిక–2026 వార్షిక సమావేశాల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్ స్కేజ్రోండ్ (Jan Willem Scheijgrond) గారు భేటీ అయ్యారు








