
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు టాటా గ్రూప్ చైర్మన్ శ్రీ నటరాజన్ చంద్రశేఖరన్ గారితో సమావేశమయ్యారు.
తెలంగాణ రైజింగ్ విజన్–2047 అంశాలతో పాటు రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల వాతావరణం, ప్రభుత్వ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి గారు టాటా గ్రూప్ చైర్మన్ గారికి వివరించారు.








