Skip to main content

Search Results

Hon’ble Prime Minister Sri Narendra Modi along with Hon’ble Chief Minister Sri A. Revanth Reddy launches multiple development projects in Hyd.

తెలంగాణలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు, రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Flagging Off Ceremony of Buses Carrying Haj Pilgrims at Haj House, Nampally, Hyderabad.

హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని హజ్ 2026 యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy laid the foundation stone for the reconstruction of the Sri Mahalakshmi Venkateswara Swamy (Kodangal Balaji) Temple.

కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణంతో పాటు కొడంగల్ లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ శిలాఫలకాలను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

Read More »

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌ గారికి విజ్ఞ‌ప్తి చేశారు

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ -II, ఫేజ్‌ -III విస్త‌ర‌ణ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్‌-Iను L&T MRHL ను రాష్ట్ర ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంద‌ని వివ‌రించారు. ప్రస్తుతం ఫేజ్-I ప్రభుత్వం ప‌రిధిలో ఉండ‌డంతో ఫేజ్‌-II, ఫేజ్‌-III విస్తరణ సులుభమవుతుందని చెప్పారు.

Read More »

విద్యా సిలబస్‌లో AI వినియోగంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం

తెలంగాణ భ‌విష్య‌త్తు ప్ర‌ణాళికపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్య‌మంత్రి గారి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రఘురామ్ రాజన్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

Read More »

పంట మార్పిడి విధానాలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (రైతు కమిషన్) ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి నివేదికను సమర్పించింది.

పంట మార్పిడిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కమిషన్‌ను కోరారు. ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి గారు, రైతు కమిషన్ సభ్యులు రాములు నాయక్ గారు, సునీల్ గారు, రాంగోపాల్ రెడ్డి గారు, జి.గంగాధర్ గారు, కేవీ నర్సింహా రెడ్డి గారు, సీహెచ్ వెంకన్న యాదవ్ గారు, ఎం. భవాని గారు ఉన్నారు.

Read More »

పే రివిజన్ కమిషన్ (PRC) నివేదికను తక్షణమే అందించాలని అధికారుల కమిటీని ఆదేశించామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు.

తెలంగాణ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC), తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులు ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read More »

విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు.

రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు.

Read More »

ఆర్టీసీ సమస్యలను వంద శాతం పరిష్కరిస్తామని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) మ‌నుగ‌డ‌, గౌర‌వాన్ని పెంపొందించి ప్ర‌యాణికులకు మెరుగైన సేవ‌లందించేందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు రావాల‌ని కార్మిక సంఘాల ప్ర‌తినిధుల‌కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సూచించారు.

Read More »
Skip to content