హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.
ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ సమకూర్చిన రెండు ఆంబులెన్స్‌లకు ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఎంఆర్ఐ స్కానర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల నుంచి రుణాల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని పేర్కొంటూ మహిళా సంఘాలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని చెప్పారు.
స్వయం సహాయక సంఘాలతో లాజిస్టిక్ పార్కులు, గోడౌన్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం పెద్ద ఎత్తున రుణాలివ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Healthcare infrastructure and women-led economic initiatives received a boost as Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inaugurated CSR-supported projects undertaken by HDFC Bank, including two ambulances and an MRI scanner for the Government Hospital in Bhupalpally.
The Chief Minister urged banks to extend greater credit support to women Self-Help Groups, citing their strong repayment record, and sought enhanced lending for logistics parks, warehouses and rice mills being developed through SHGs. The programme was attended by newly appointed Chief Secretary to the Government Sri Sanjay Jaju, public representatives and senior HDFC Bank officials.

