చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి గారు శాసనమండలి భవనాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనర్సింహ గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర రావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, మహమ్మద్ అజహరుద్దీన్ గారితో పాటు ప్రభుత్వ సలహాదారులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మండలిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో రేవంత్ రెడ్డి గారు పూజ నిర్వహించారు.
The renovated Legislative Council building in the historic Legislative Assembly premises was inaugurated by Hon’ble Chief Minister Sri A. Revanth Reddy.
The Chief Minister, along with Hon’ble Legislative Council Chairman Gutta Sukhender Reddy, Hon’ble Legislative Assembly Speaker Prasad Kumar, Hon’ble Council Deputy Chairman Banda Prakash, Hon’ble Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, and ministers, inaugurated the building and participated in puja rituals.
Hon’ble Ministers Duddilla Sridhar Babu, Damodar Rajanarsimha, Komatireddy Venkat Reddy, Tummala Nageswara Rao, Jupalli Krishna Rao, Ponguleti Srinivasa Reddy, Ponnam Prabhakar, Vivek Venkataswamy, and Mohammad Azharuddin, along with government advisors, several MPs, MLCs, and MLAs, attended the ceremony. The Chief Minister also performed a puja at the Chief Minister’s office in the Council building.
