రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్త మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వాకిటి శ్రీహరి గారు ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా ఉన్నారు.

మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు పలువురు ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.