మిర్యాలగూడలో 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్యకు 1138 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం పంపిణీ, బోనస్, ఉచిత విద్యుత్ పథకాల గురించి ప్రస్తావిస్తూ, దేశంలోనే రైతుల సంక్షేమానికి అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy laid the foundation stone for the Young India Integrated Residential School being constructed at a cost of Rs. 200 crore in Miryalaguda. He also participated in and addressed the Praja Palana – Pragathi Bata programme held at Gudoor village in Miryalaguda mandal of Nalgonda district.
On the occasion, the Chief Minister handed over a cheque of Rs. 1,138 crore to the District Women’s Self-Help Groups (SHGs).
Addressing the gathering, the Chief Minister elaborated on the various welfare and development initiatives being implemented by the state government. He outlined the government’s flagship welfare initiatives, including farmer loan waiver, Rythu Bharosa, distribution of fine rice, crop bonuses, and free electricity, reaffirming the People’s Government’s unwavering commitment to farmers’ welfare.
Ministers Sri N. Uttam Kumar Reddy, Sri Komatireddy Venkat Reddy, and Sri Adluri Lakshman Kumar, along with public representatives from the combined district, participated in the programme.

