
Hon’ble CM Sri A. Revanth Reddy conducted a high-level review meeting with Sports Department officials
క్రీడలకు అవసరమైన మైదానాలు, యూనివర్సిటీ, శిక్షణ తదితర అంశాలపై క్రీడాశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

క్రీడలకు అవసరమైన మైదానాలు, యూనివర్సిటీ, శిక్షణ తదితర అంశాలపై క్రీడాశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మహిళా జర్నలిస్టులను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని కోరారు

హైదరాబాద్ శివరాంపల్లిలో పునరుద్ధరించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు ప్రజా ప్రతినిధులు, ఉన్నధికారులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మహిళా జర్నలిస్టులను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని కోరారు.

చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి గారు శాసనమండలి భవనాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

మావోయిస్టులు జనజీవనంలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ, హైదరాబాద్‌లోని ఐసీసీసీ (ICCC)లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో 130 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు.

హైదరాబాద్ జేఎన్‌టీయూ క్యాంపస్ ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

బుద్వేల్ లేఅవుట్‌తో కలిపే రేడియల్ రోడ్-2 ఇంటర్‌చేంజ్‌కు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్వాలగూడలో ఎకో పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.

ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో, మాదిగ ఉద్యోగుల కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి గారికి అభినందన సభ నిర్వహించారు. ఎంతో అభిమానంతో ఈ సభను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారు సంతోషం వ్యక్తం చేశారు.

మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు.
Site Map | Screen Reader | Contact | Terms Of Use | Disclaimer | Accessibility | Website Policies | Cyber Security | Help | FAQs | Grievance
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on April 15, 2026.