
CM Sri A Revanth Reddy participated in May Day Celebrations at Ravindra Bharathi
తెలంగాణలోని అసంఘటిత కార్మికుల కోసం దేశానికి రోల్ మాడల్‌గా ఉండే ఒక మంచి విధానం తీసుకొస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.

తెలంగాణలోని అసంఘటిత కార్మికుల కోసం దేశానికి రోల్ మాడల్‌గా ఉండే ఒక మంచి విధానం తీసుకొస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.

దేశంలో సమూలమైన మార్పు రావాలంటే ప్రతి వారికీ నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ముఖ్యమంత్రి గారు పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.

మిస్ వరల్డ్ (Miss World) 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. మే నెల 10 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న MISS WORLD-2025 ఏర్పాట్లపై అధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.

చిత్రకారుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలో పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

జాపాన్‌లోని హిరోషిమా స్థానిక ప్రభుత్వం (Hiroshima Prefecture) – తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హిరోషిమా ప్రిఫెక్చర్ వైస్ గవర్నర్ మికా యొకోటా (Mika Yokota) గారితో సమావేశమై పలు అంశాలను చర్చించింది.

మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రభుత్వ విద్యా విధానంలో ప్రాథమిక స్థాయిల్లోనే అస్పష్టత ఉన్నదని గమనించి, ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేసినట్టు వివరించారు.

భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

ఒక గొప్ప నమూనా నగరంగా ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మించి, తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు.
Site Map | Screen Reader | Contact | Terms Of Use | Disclaimer | Accessibility | Website Policies | Cyber Security | Help | FAQs | Grievance
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on [last-modified].