[language-switcher]
        Skip to main content

Video Gallery

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Attends the Rugby Premier League Season-2 Finals at Gachibowli, Hyderabad.

గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్–2లో విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టును ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబై డ్రీమర్స్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో 41–17 తేడాతో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurates the Pylon for HAM Roads at Market Yard, Kanagal, Nalgonda.

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 13.06 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా 6,092 కిలోమీటర్ల పొడవు గల 441 రహదారులను విస్తరించే కార్యక్రమం పైలాన్ ఆవిష్కరణతో ప్రారంభమైంది. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్థానికులను పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in MoU Signing Ceremony for Insurance Coverage of State Government Employees.

“సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ.. ఏదైనా అందరికీ ప్రభుత్వమే యజమాని. ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా భద్రత కలిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అందుకే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అడగకపోయినా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది” అని అన్నారు.

Read More »

ఎల్‌బీ స్టేడియంలో విద్యార్థులకు కిట్ల పంపిణీ, విద్యా అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

“విద్యార్థులు బాగా బాగా చదువుకోవాలి. చదువుకోవడానికి ఏం కావాలో సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటా. పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కాకుండా భవిష్యత్తులో రవాణా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రంలో 27.50 లక్షల మంది విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్స్ కిట్స్ అందిస్తున్నాం. తెలంగాణను ఒక ఎడ్యుకేషన్ హబ్‌గా, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం” అని ముఖ్యమంత్రి గారు అన్నారు

Read More »

ఎల్‌బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని గుర్రంగూడ ఎకోపార్క్‌లో ముఖ్యమంత్రి గారు మొక్కను నాటి వనమహోత్సవం – 2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వనమహోత్సవంలో భాగంగా పలు జిల్లాల్లో మొక్కలు నాటడం, వనాల పెంపుతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ, ప్రకృతి సంరక్షణకు సంబంధించి రూ.35.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ. 17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు శ్రీకారం చుట్టారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurates Telangana Public School, Launches the Breakfast Scheme, and Addresses a Public Gathering at Arutla.

తెలంగాణలో మొట్టమొదటి ఈ ఆదర్శ పాఠశాలను ప్రారంభించిన తర్వాత ఆవరణ ఆసాంతం తిరిగి పరిశీలించారు. ఇదే సందర్భంగా పాఠశాలల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.

Read More »
Skip to content