Skip to main content

Photo Gallery

CM Sri A. Revanth Reddy participated in the inauguration of PJR Flyover and public meeting at Gachibowli, Hyderabad.

గచ్చిబౌలి కూడలిలో ఆరు లేన్లతో నిర్మించిన దివంగత పి జనార్ధన్ రెడ్డి ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణను మూడు ప్రాంతాలుగా.. ఓఆర్ఆర్ లోపలి భాగంలో కోర్ అర్బన్‌గా, ఓఆర్ఆర్ అవతలి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు సెమీ-అర్బన్‌గా, రీజినల్ రింగ్ రోడ్డు అవతలి భాగంలో గ్రామీణ ప్రాంతంగా విభజించి, ప్రాంతాల వారిగా ప్రణాళికా బద్ధమైన అభివృద్ధితో ముందుకు వెళతాం.

CM Sri A. Revanth Reddy participated in Rythu Nestham program at Rajiv Gandhi Statue, opposite Dr. BR Ambedkar State Secretariat | Rythu Bharosa.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 16 వందల రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్షలాది రైతులు వీక్షించారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met former Prime Minister of the United Kingdom, Sri Tony Blair, in New Delhi.

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ప్రధాన మంత్రి శ్రీ టోనీ బ్లెయిర్ గారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ‘తెలంగాణ రైజింగ్ 2047’ (Telangana Rising 2047) విజన్‌లోని కీలక అంశాలను పంచుకున్నారు.

CM Sri A. Revanth Reddy affirmed that the Telangana Government will wage an uncompromising fight to safeguard the state’s rightful share of water.

గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం బాధ్యతగా రాజకీయ, న్యాయ పోరాటం చేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి నుంచి రాయలసీమకు నీటిని తరలించాలని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రధానమంత్రి గారితో సహా అందరినీ కలుస్తామని అన్నారు.

CM Sri A. Revanth Reddy formally inaugurated the prestigious Google Safety Engineering Center (GSEC) at Divyasree Building near Hitech City, Hyderabad.

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకమైన గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. హైటెక్ సిటీ సమీపంలో దివ్యశ్రీ బిల్డింగ్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ముఖ్యమంత్రి గారు GSEC ను ప్రారంభించారు.

CM Sri A. Revanth Reddy Lays Foundation Stones for Development Works and Addresses Public Meeting at Yadadri Bhuvanagiri Dist.

యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గంలోని తిరుమలాపురంలో ‘ప్రజాపాలన – ప్రగతిబాట’ కార్యక్రమంలో భాగంగా గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో పాటు మొత్తంగా 1,051.45 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

Skip to content