
CM Sri A. Revanth Reddy participated in Teachers’ Day Celebrations 2025 at Shilpakala Vedika, Hyderabad
గురుపూజోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది.

గురుపూజోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది.

ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహా గణపతి మహదేవుడిని దర్శించుకుని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపైనా ఉండాలని ప్రార్థించారు.

వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి గారు సమీకృత కలెక్టరేట్ భవనంలో ఉన్నతస్థాయి సమావేశంలో పరిస్థితులను సమీక్షించారు. ప్రజలను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై అదికారులకు పలు సూచనలు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారితో కలిసి పాల్గొన్నారు. అనంతరం దామరచర్లలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని వేముల గ్రామంలో ప్రఖ్యాత ఎస్జీడీ – కార్నింగ్ టెక్నాలజీస్ సంస్థ నిర్మించిన నూతన యూనిట్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ ఇండ్ల పైలాన్‌ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకున్న కుటుంబాలతో కొద్దిసేపు గడిపారు.

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

కేరళలోని అలప్పుళలో లోక్‌సభ సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ గారు ప్రతిభ కనబరిచే విద్యార్థినీ విద్యార్థులకు ఎంపీ మెరిట్ అవార్డులు-2025 బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన విద్యా బోధన, బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు
Site Map | Screen Reader | Contact | Terms Of Use | Disclaimer | Accessibility | Website Policies | Cyber Security | Help | FAQs | Grievance
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on December 1, 2025.