
అటవీ శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) లో మంత్రి కొండా సురేఖ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. సింగపూర్ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయని, మనకు భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు.. అందులోనే నదులు, జలపాతాలు ఉన్నందున ఆ వనరులను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.








