
Hon’ble CM Sri A. Revanth Reddy participated in inauguration of CREDAI Property Show at HITEX, Hyderabad.
క్రెడాయ్ హైదరాబాద్ (CREDAI Hyderabad) ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

క్రెడాయ్ హైదరాబాద్ (CREDAI Hyderabad) ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ రాణిమహల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి గారు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లైసెన్డ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని ఆదేశించారు.

రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. సింగపూర్ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయని, మనకు భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు.. అందులోనే నదులు, జలపాతాలు ఉన్నందున ఆ వనరులను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన ముఖ్యమంత్రి గారు అలాంటి ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించటంతో పాటు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అభివృద్ధికి వీలుగా పనులు చేపట్టాలని చెప్పారు.

The Chief Minister participated in the Porubata Dharna held at Jantar Mantar in New Delhi, organized to demand approval of the 42% BC reservation bills.

ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ (Eli Lilly and Co) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

హెచ్ఐసీసీలో నిర్వహించిన మొదటి ఎడిషన్ తెలంగాణ క్రీడా సదస్సు ( 1st Edition Telangana Sports Conclave – 2025) లో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా విధానాన్ని (Telangana Sports Policy) ప్రకటించారు.
Site Map | Screen Reader | Contact | Terms Of Use | Disclaimer | Accessibility | Website Policies | Cyber Security | Help | FAQs | Grievance
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on December 1, 2025.