
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in ‘Musi Invites’ – A Presentation on Musi River Rejuvenation (Phase I) by MRDCL in Hyderabad.
మూసీ నది పునరుజ్జీవం ఫేజ్ -1 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. మూసీ చారిత్రక పరిణామాలు, ప్రాజెక్టు లక్ష్యాలు, దాని ఆవశ్యకతను వివరిస్తూ, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు, నిపుణులు, నిష్ణాతులు, పౌరులు తమ సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Inauguration of Allu Arjun’s Allu Cinemas at Kokapet, Hyd.
సినీ నిర్మాత అల్లు అరవింద్ గారి కుటుంబం కోకాపేటలో నిర్మించిన దేశంలోని అతిపెద్ద డోల్బీ అల్లు సినిమాస్ (Allu Cinemas)ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల తరహాలో సినిమా ఇండస్ట్రీగా ఎదగాలని ఆకాంక్షించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Inauguration of Medicover Hospital at Kokapet, Hyd.
హైదరాబాద్ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి గారు మంత్రి దామోదర రాజనర్సింహ గారితో కలిసి ప్రారంభించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurated – Netflix Eyeline Studios Global VFX and Virtual Production Hub at HITEC City, Hyd.
నెట్‌ఫ్లిక్స్ విస్తరణకు భారత్ ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలను హైదరాబాద్ నుంచి కార్యకలాపాలను నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ కార్యాలయం కూడా ఈ మహానగరం నుంచి కొనసాగించాలని అభిలషించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the oath-taking ceremony of Hon’ble Sri Shiv Pratap Shukla as Governor of Telangana at Lok Bhavan, Hyd.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో ప్రమాణం చేయించారు. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated HYDRAA rejuvenated Nalla Cheruvu Lake in Kukatpally, Hyderabad.
కూకట్‌పల్లిలో హైడ్రా HYDRAA పునరుద్ధరించిన నల్లచెరువును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. చెరువులో గంగమ్మతల్లికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.