
Hon’ble CM Sri A. Revanth Reddy participated in Sri Krishna Sadar Sammelan at NTR Stadium, Hyderabad.
హైదరాబాద్‌లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

హైదరాబాద్ శిల్పకళా వేదికలో లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్స్‌ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు. శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన “ప్రజాపాలనలో కొలువుల పండుగ” కార్యక్రమంలో భాగంగా గ్రూప్ –2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాల అందజేశారు.

శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన “ప్రజాపాలనలో కొలువుల పండుగ” కార్యక్రమంలో భాగంగా గ్రూప్ –2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాల అందజేశారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లెయింట్ అథారిటీ (SPCA) కి సంబంధించి రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్‌ను, లోగోను ఆవిష్కరించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి 60 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాల విడుదల, హాస్టళ్లలో మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునే వెసులుబాటు కలిగించింది.

ముఖ్యమంత్రి గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఏఐ హబ్, టీ-స్క్వేర్ తదితర అంశాలపై సమీక్షించారు. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన టీ-స్క్వేర్ ప్రాజెక్టుపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు.

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎలీ లిల్లీ అండ్ కో (Eli Lilly and Co) ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్ గారు, సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్స్‌లో టూకర్ గారితో పాటు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు.

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహాత్ముడికి పుష్పాంజలి ఘటించారు.
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on December 1, 2025.