Sign In

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన గురువారం నాడు (మార్చ్ 9) ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. సందర్భంగా కేబినెట్ పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి శ్రీ టి.హరీశ్ రావు మీడియా సమావేశంలో వివరించారు. 


మీడియా సమావేశంలో శాసనసభా వ్యవహారాలు, ఆర్ & బి శాఖల మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమశాఖల మంత్రి శ్రీ గంగుల కమలాకర్, కార్మికశాఖ మంత్రి శ్రీ చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ శంభీపూర్ రాజు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ రవిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కేబినెట్ తీర్మానాలు - మంత్రి టి.హరీశ్ రావు మీడియా సమావేశం - ముఖ్యాంశాలు


​1,30,000 కుటుంబాలకు రెండవ విడత దళిత బంధు పంపిణీ:

  • రెండవ విడత కింద 1,30,000 కుటుంబాలకు రెండవ విడత దళితబంధు పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాల్సిందిగా సంబంధిత అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశలివ్వడం జరిగింది.
  • ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా 2021 ఆగస్టు 16 లబ్దిదారునికి  10 లక్షల రూపాయల ఉచిత గ్రాంటునిచ్చే దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగష్టు 16 తేదీన దళితబంధు వేడుకలను ఘనంగా జరపాలని కేబినెట్ నిర్ణయించింది.
  • హుజురాబాద్ నియోజకవర్గంలో 100 శాతం దళితబంధు పథకాన్ని అమలు చేయడం జరిగింది. 
  • మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 1100 మందికి దఫాలో దళితబంధును అందించాలని నిర్ణయించడం జరిగింది. దఫా మొత్తంగా 1,29,800 కుటుంబాలకు దళితబంధును అమలు చేయడం జరుగుతుంది. మరో 200 మంది లబ్దిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి అప్పగించడం జరిగింది. మొత్తంగా 1,30,000 కుటుంబాలకు దళితబంధును అందించడం జరుగుతుంది. గతంలో మాదిరిగా జిల్లా కలెక్టర్లు లబ్దిదారులను ఎంపిక చేస్తారు.


సొంత జాగా ఉన్నవారికి ఇండ్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద గ్రాంటు :

  • సొంత జాగా ఉన్నవారికి ఇండ్లు కట్టుకునే నిమిత్తం ఆర్థిక సాయం చేసే పథకానికి ప్రభుత్వంగృహలక్ష్మి పథకంగా పేరు నిర్ణయించింది.
  • గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించడమైంది.
  • ఒక్కొక్క నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించాలని  నిర్ణయించడం జరిగింది.
  • ఇవే కాకుండా 43 వేల ఇండ్లు స్టేట్ కోటాలో పెట్టడం జరిగింది. 
  • మొత్తంగా 4 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించడం జరిగింది
  • ఒక్కొక్క ఇంటికి గ్రాంటుగా 3 లక్షల రూపాయలను ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కొక్క దఫా 1 లక్ష రూపాయల చొప్పున మూడు దఫాలుగా 3 లక్షల రూపాయలను గ్రాంటుగా వారి వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.
  • పథకానికి 12 వేల కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించడం జరిగింది.
  • మంజూరు చేసే ఇండ్లను మహిళ పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది.
  • గత ప్రభుత్వాలు గృహనిర్మాణ సంస్థ ద్వారా పేద ప్రజలకు ఇండ్లు కట్టుకునేందుకు ఇచ్చిన 4 వేల కోట్ల రూపాయల అప్పులను కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేస్తున్నది.


రెండవ విడత  గొర్రెల పంపిణీ:

  • మొదటి దఫా గొర్రెల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 7,31,000 మంది లబ్దిదారులను గుర్తించడం జరిగింది. ఇందులో 50 శాతం పంపిణీ గతంలోనే పూర్తయింది.
  • మిగతా 50 శాతం గొర్రెల పంపిణీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. దీనికోసం 4,463 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేబినేట్ తీర్మానించింది. 
  • పంపిణీ ప్రక్రియను ఏప్రిల్ నెలలో ప్రారంభించి ఆగష్టు నెలలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో  ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా జరపాలని ఆదేశాలివ్వడం జరిగింది.


పోడు భూముల పంపిణీ :

  • రాష్ట్రంలో 4,00,903 ఎకరాలను 1,55,393 మంది అడవి బిడ్డలకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రక్రియలన్నీ పూర్తయి పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
  • పంపిణీని వెంటనే ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. 
  • పోడు భూముల పంపిణీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది.


ఏప్రిల్ 14 అంబేద్కర్ విగ్రాహావిష్కరణ :

  • భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత,  భారత రత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆయన జన్మదినోత్సవమైన ఏప్రిల్ 14 ఘనంగా నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. 
  • రాష్ట్రం నలుమూలనుంచి లక్షలాదిమంది దళితబిడ్డలను హైద్రాబాద్ కు ఆహ్వనించి వారి సమక్షంలో ఆవిష్కరించాలని, సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది.


జీవో 58, 59 దరఖాస్తు తేదీ పొడిగింపు :

  • జీవో 58, 59 లకు సంబంధించి మిగిలిన లబ్దిదారుల విజ్జప్తి మేరకు చివరి అవకాశంగా దరఖాస్తు సమయాన్ని నెలరోజులకు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. 
  • ఇప్పటివరకు జీవో 58 ద్వారా 1,45,668 మందికి పట్టాలివ్వడం జరిగింది. 
  • జీవో 59 ద్వారా 42,000 మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. కటాఫ్ తేది గతంలోని 2014 నుండి 2020 కి మారుస్తూ  పొడిగించాలని కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో జీవో 58, 59 ద్వారా మిగతావారికి ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. 
  • గత ప్రభుత్వాలు పేదల ఇండ్లు కూల్చి, వాళ్ళు ఉసురు పోసుకున్నాయి.
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పట్టాలు తయారుచేసి వాళ్ళకందిస్తున్నది.


కాశీ, శబరిమల పుణ్యక్షేత్రాల్లో వసతి గృహాల నిర్మాణం :

  • సనాతనధర్మాన్ని పాటించే ప్రతి వొక్కరూ కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని కోరుకుంటారు. 
  • కాశీలో  మరణిస్తే సద్గతులు ప్రాప్తిస్తాయని హిందువుల విశ్వాసం. తెలంగాణ రాష్ట్రం నుంచి కాశీ యాత్రకు విరివిగా భక్తులు వెళుతున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం అక్కడ వసతి గృహాన్ని నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది. 60 వేల చదరపు అడుగుల్లో నిర్మాణం జరుగుతుంది. ఇందుకు గాను రూ. 25 కోట్లను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 
  • ఇందుకు సంబంధించిన చర్యల కోసం, కాశీలో స్థలం ఎంపిక కోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మంత్రుల బృందం పర్యటించి రావాలని తీర్మానించింది.
  • అదే విధంగా శబరిమలలో తెలంగాణ భక్తుల సౌకర్యార్థం కోసం అక్కడకూడా వసతి గృహాన్ని నిర్మించాలని తీర్మానించింది. ఇందుకు గాను 25 కోట్లు మంజూరు చేసింది.  సిఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ గారికి బాధ్యతలను అప్పగించడం జరిగింది. తదనంతరం మంత్రుల బృందం వెళ్ళి అక్కడ పనులు ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో సీఎం కేసీఆర్ గారు కేరళ సీఎం గారితో విషయం పై చర్చించారు. 
  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, అమరవీరుల స్థూపాన్ని పనులు పూర్తయిన వెంటనే మంచి ముహూర్తం చూసుకుని ప్రారంభించడం జరుగుతుంది. 
  • సొంత జాగా ఉన్నవారికి ఇండ్ల నిర్మాణానికి గృహలక్ష్మి పథకంతో పాటు,  డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం కింద ఇండ్ల నిర్మాణం, పంపిణీ జరుగుతూనే ఉంటుందని కేబినెట్ స్పష్టం చేసింది.​


The Telangana State Cabinet meeting is held for a long time at Pragati Bhavan on Thursday under the chairmanship of Chief Minister Sri K. Chandrashekhar Rao. The Cabinet discussed many issues and took decisions. State Finance and Health Minister Sri T. Harish Rao briefed the media about the cabinet decisions.


State Legislative  Affairs and  R&B Minister Vemula Prashanth Reddy, Excise and Tourism Minister V. Srinivas Goud, Civil Supplies and  BC Welfare Minister Gangula Kamalakar, Labour Minister Ch  Mallareddy, MLC Shambhipur Raju, Civil Supplies Corporation Chairman Ravinder Singh and others participated in the media conference. .


State Cabinet Resolutions - Minister T. Harish Rao's Media Conference - Highlights

Distribution of second installment of Dalit Bandhu to 1,30,000 families:

  • CM KCR  directed the concerned authorities to immediately start the second phase of Dalit Bandhu distribution programme   to 1,30,000 families.
  • Dalit Bandhu scheme had been launched on August 16, 2021  to provide a grant of Rs 10 lakh to each beneficiary. The Cabinet  decided to organize  Dalit Bandhu celebrations on August 16  every year.
  • 100 percent Dalit Bandhu scheme has been implemented in Huzurabad constituency.
  • In the remaining 118 constituencies, the cabinet  decided to extend the Dalit Bandhu benefit to 1100 people in each constituency. Dalit Bandhu will be implemented for a total of 1,29,800 families in this phase. The responsibility of selection of another 200 beneficiaries has been entrusted to the state Chief Secretary . A total of 1,30,000 families will be provided Dalit Bandhu scheme benefit. District Collectors will select the beneficiaries.


Grant under “ Griha Lakshmi”  Scheme for construction of houses for those who own plot :


  • State  Government  decided to name the new  housing programme as  "Griha Lakshmi Scheme" to provide financial assistance to those who have their own land to build houses.
  • Cabinet decided to provide the grant  to 4 lakh people under the scheme.
  • 3,000 houses will be built under the scheme in each assembly segment.  
  • Apart from this, 43,000 houses will be sanctioned under state quota.
  • Government provides Rs 3 lakh as grant to each household. The government will deposit Rs 3 lakh as grant in the beneficiary’s bank account directly. The benefit will be deposited  in  three installments of Rs 1 lakh each.
  • Rs 12,000  crores  allocated in the budget for this scheme.
  • The scheme benefit will be given in the name of women.
  • Cabinet approved the waiver off the loans of Rs 4,000 crore  given by the previous governments to build houses for the poor people through the Housing Corporation.


Second phase Sheep distribution programme :

  • The process of distribution of the first batch of sheep has been completed. 7,31,000 beneficiaries have been identified in the entire state. 50 percent of them  already availed the benefit.


  • CM KCR  decided to take up the process of distribution of sheep to the 50 percent identified beneficiaries immediately. The Cabinet approved the  allocation of  Rs 4,463 crore  for the purpose.
  • Sheep distribution will start from  April and complete in August. Under the direction of District Collectors, orders have been given to conduct this process in a transparent and expeditious manner.


Distribution of Podu  Lands:

  • The Cabinet decided to distribute 4,00,903 acres of  Podu  lands to 1,55,393 forest dwellers in the state. All the processes are completed and ready for the distribution of Pattas.
  • Cabinet decided to start this distribution immediately.
  • The process of distribution of Podu lands will continue.


Dr Ambedkar statue unveiling on April 14:

  • The state cabinet adopted resolution to unveil the India’s tallest statue of  the Architect of Indian Constitution and inspiration to social justice Bharat Ratna Dr. B.R. Ambdekar on his birthday on April 14.   
  • Lakhs of Dalits  from all over the state will be invited to Hyderabad to witness the inauguration of the statue. A mammoth public meeting will be held on this occasion.


Extension of GO 58 and 59 :

  • The cabinet took decision to extend the application time  by one month as a last chance for those waiting to regularize their properties under GO 58 and 59.
  • So far 1,45,668 people benefitted under GO 58.
  • 42,000 people benefited through GO 59. In the background of the cabinet's decision to extend the cutoff date from 2014 to 2020,  others will be provided an opportunity to build houses in the lands which covered under GO 58 and 59.
  • Previous governments demolished the houses of the poor and they suffered.
  • Telangana government is preparing the title deeds and distribute them to  the beneficiaries in a transparent manner.


Construction of Guest Houses in Kashi and Sabarimala shrines:

  • Every ardent religious follower wants to visit the holy Kashi shrine.
  • In view of large number of devotees going to Kashi Yatra from Telangana state, the Cabinet decided to construct a guest house there for their convenience. The construction will be done in 60,000 square feet. Rs.25 crore is sanctioned.   
  • A group of ministers led by state Chief Secretary would visit Kashi for site selection.
  • Similarly, for the convenience of Telangana devotees at Sabarimala, the cabinet decided to construct a guest house there as well. Government sanctioned  Rs 25 crore . CMO OSD  Smt Priyanka Varghese has been entrusted with these responsibilities. Subsequently, the Cabinet decided that a team of ministers will  go and start work there. Earlier, CM KCR discussed this matter with Kerala CM.


Dr. B.R. Ambedkar Telangana State Secretariat and  Martyrs' Memorial will be inaugurated  on the auspicious day soon after the completion of works. The cabinet clarified that construction and distribution of houses under the Double Bedroom Housing scheme will continue in addition to the Grilahakshmi scheme.